వరంగల్ ను చదువుల కేద్రంగా చేస్తాను.
వరంగల్ ప్రతినిధి : వరంగల్ ను ఎడ్యుకేషన్ హబ్‌గా అభివృద్ధి చేసే దృఢసం కల్పంతో టిఆర్‌ఎస్ ప్రభుత్వం ముందుకు పోతుందని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ, మార్కెటింగ్‌శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం హన్మకొండలోని కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటి వద్ద డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అరూరి రమేష్, రామలింగారెడ్డి, టిఆర్‌ఎస్ జిల్లా ఇన్‌ఛార్జి పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే వరంగల్‌లో కాళోజీ హెల్త్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడంతోపాటు గిరిజన విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రానికి వచ్చిన ఒకే ఒక్క సైనిక్ స్కూల్‌ను, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బ్రాంచిని వరంగల్‌లో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. వరంగల్‌కు ఔటర్ రింగ్‌రోడ్డుతో పాటు మహిళలు, పిల్లల కోసం ప్రత్యేకంగా ఆస్పత్రి ఏర్పాటు చేశామన్నారు. వరంగల్‌లోని భద్రకాళి, వడ్డేపల్లి, చిన్నివడ్డేపల్లి చెరువులనుట్యాంకుబాండ్‌లుగా అభివృద్ధి చేసేందుకు మిషన్ కాకతీయ కింద నిధులు మంజూరు చేశామన్నారు.
కిషన్‌రెడ్డి చెల్లని రూపాయి : బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చెల్లని రూపాయని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లోని ఐదు ఎమ్మెల్యే నియోజకవర్గాలలోని ఒక్క కార్పొరేటర్‌ను బిజెపి గెలిపించుకోలేదు, కిషన్‌రెడ్డి తన అంబర్‌పేట నియోజకవర్గంలో పది మంది కార్పొరేటర్లు ఉంటే అన్నింటినీ టిఆర్‌ఎస్ పార్టీయే గెలుచుకుందన్నారు. తెలుగువాడినని చెప్పుకునే వెంకయ్యనాయుడు ఆంధ్రలో మూడు స్మార్ట్‌సిటీలను ఇచ్చి తెలంగాణలో అన్ని అర్హతలు ఉన్న వరంగల్‌కు స్మార్ట్‌సిటీ దక్కకుండా చేసినందుకు బిజెపికి ఓటువేయాలా? వరంగల్‌కు మంజూరు అయిన వ్యాగన్‌ఫ్యాక్టరీని రద్దు చేసినందుకు వేయాలా అని ప్రశ్నించారు. బిజెపి ముందుగా వరంగల్ పట్టణ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చెప్పిన తరువాతనే ఎన్నికల ప్రచారం చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు
కాంగ్రెస్, టిడిపి ఏమి చేయలేవు : కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో, రాష్ట్రంలో పదేళ్లపాటు అధికారంలో ఉండి వరంగల్‌కు ఏమీ చేయలేదని, ఇప్పుడు అధికారంలో లేకుండా ఏమి చేస్తుందని ప్రశ్నించారు. టిడిపి ఆరిపోతున్న దీపమని అన్నారు. కాంగ్రెస్, టిడిపిలకు ఓటు వేస్తే మురుగుకాలువలో వేసినట్లేనని హరీశ్‌రావు అన్నారు. ఓటు వేసే ముందు ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఉద్యమంలో వరంగల్ ప్రజలు గుండెల్లోపెట్టుకొని చూసుకున్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా భాగస్వాములు కావాలన్నారు. ప్రజల మధ్యలో నిరంతరం ఉండే పార్టీకి చావు ఉండదని,టిఆర్‌ఎస్‌పార్టీ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ప్రజల్లో ఉంది. ఈనాడు అధికారంలో ఉంటూ ప్రజల్లోనే ఉందని హరీశ్‌రావు అన్నారు.
వరంగల్, ఖమ్మం కార్పోరేషన్‌కు టీఆర్‌ఎస్ జాబితా విడుదల
వరంగల్ బ్యూరో ,ఫిబ్రవరి 24 (ఎ.ఎం.ఎస్) : గ్రేటర్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికకు సంబంధించి అభ్యర్థు జాబితాను టీఆర్ ఎస్ ప్రకటించింది. వరంగల్ లో 28, ఖమ్మంలో 15 మంది క్యాండిడేట్ల లిస్ట్ ను ఇప్పటి వరకు రిలీజ్ చేసింది. రిజర్వేషన్లు, ఇతర సవిూకరణాను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థును ఖరారు చేసింది.అర్బన్ వార్ కు టీఆర్ ఎస్ అన్ని విధాలా సన్నద్ధమవుతోంది. కార్పొరేషన్ ఎన్నికల్లో గొపే ఏకైక క్ష్యంగా ముందుకెళుతోంది. దీనిలో భాగంగానే ఎన్నిక ప్రక్రియలో కీక ఘట్టమైన అభ్యర్థు జాబితాను పార్టీ ప్రకటించింది. రిజర్వేషన్లతో పాటు అన్ని వర్గాకు తగిన ప్రాధాన్యం ఉండేలా చేస్తూ? లిస్ట్ రిలీజ్ చేసింది.
గ్రేటర్ వరంగల్ బరిలో ఉన్న అభ్యర్థు వివరాను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి విడుద చేశారు. 2వ డివిజన్ నుంచి లేద్లె బాయ్య, 3వ డివిజన్ నుంచి లింగం మౌనిక, 4వ డివిజన్ నుంచి అచ్చ క్ష్మి, 5వ డివిజన్ నుంచి పసునూరి స్వర్ణత బరిలో ఉన్నారు. 8 వ డివిజన్ నుంచి దామోదర్ యాదవ్, 10వ డివిజన్ నుంచి రాజేందర్, 11వ డివిజన్ నుంచి రాధిక, 12వ డివిజన్ నుంచి తూర్పాటి సులోచన పేర్లు ఖరారు చేశారు. 13వ డివిజన్ నుంచి రaాన్సి, 14వ డివిజన్ నుంచి న్లగొండ రమేశ్, 15వ డివిజన్ నుంచి మున్వర్ ఉన్నీసా, 17వ డివిజన్ నుంచి జారతి అరుణ పేర్లను ప్రకటించారు. ఇక 18వ డివిజన్ నుంచి శామంతు పద్మ, 19వ డివిజన్ నుంచి నన్నపునేని నరేందర్, 20వ డివిజన్ నుంచి ఎంబాడి రవీందర్ ఎన్నిక బరిలో నివనున్నారు. 28వ డివిజన్ నుంచి ఎలిగం లీలావతి, 30వ డివిజన్ నుంచి జోరిక రమేశ్, 34వ డివిజన్ నుంచి మాధవి రెడ్డి, 39వ డివిజన్ నుంచి చీకటి ఆనందం పేర్లు ఖరారయ్యాయి. ఇక 46వ డివిజన్ నుంచి బైరి వెంకట్రాజం, 51 వ డివిజన్ నుంచి బిల్లా ఉదయ్ రెడ్డి, 57వ డివిజన్ నుంచి జక్కు శ్రీనివాస్, 58వ డివిజన్ నుంచి బానోతు క్పన పోటీ చేయనున్నారు.
అటు, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికకు సంబంధించి టీఆర్‌ఎస్ అభ్యర్థు జాబితాను ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి విడుద చేశారు. 1వ డివిజన్ నుంచి ధరావత్ రామ్మూర్తి, 2వ డివిజన్ నుంచి గుగులోత్ పాపాలాల్, 3వ డివిజన్ నుంచి కొనకంచి సరళ, 12వ డివిజన్ నుంచి గాజు వసంత, 13వ డివిజన్ నుంచి ఆళ్ల నిరీష ఎన్నిక బరిలో ఉన్నారు. 15వ డివిజన్ నుంచి వీరస్వామి రమణమ్మ, 21వ డివిజన్ నుంచి కర్నాటి కృష్ణ, 22వ డివిజన్ నుంచి చావా నారాయణరావు, 23వ డివిజన్ నుంచి శశికళ పోటీ చేయనున్నారు. ఇక 31వ డివిజన్ నుంచి గుడిపుడి సునీత, 32వ డివిజన్ నుంచి కుమ్మరి ఇందిర, 33వ డివిజన్ నుంచి శీంశెట్టి రమ, 41వ డివిజన్ నుంచి మెంతు గీత, 42వ డివిజన్ నుంచి బాదె సుజాత,45వ డివిజన్ నుంచి పోతుగంటి వాణి పేర్లను ప్రకటించారు.
---------------------------------------------------------------
పెద్దవంగర గ్రామపంచాయితి ముందు దళితు ధర్నా
కొడకండ్ల ఫిబ్రవరి 23 (ఎ.ఎం.ఎస్) : మండంలోని నిరుపేదలైను దళితుందరికి 3ఎకరా భూమిని ఇవ్వని తెంగాణ రైతు కూలీ సమైక్య ఆద్వర్యంలో మంగళవారం పెద్దవంగర గ్రామపంచాయితి ముందు ధర్నా నిర్వహించారు.అనంతరం ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు ఇ్లందు శ్రీను మాట్లడుతూ తెంగాణలోని నిరుపేదందరికి 3ఎకరా భూమిని ఇవ్వని గ్రామ పంచాయితి ఎంపికల్లో రాజకీయాను పక్కన పెట్టి నిరుపేదలైన దళితుకు న్యాయం చేయన్నారు.పెద్దవంగర భూపంపిణిలో ప్రభుత్వం 33పకరాు కొనుగొు చేసి, గ్రామపంచాయితి ఎంపికలో అన్ని అవకతవకు ఏర్పాడ్డాయని మళ్ళి గ్రామపంచాయితి సభలో తీర్మాణం చేసి భ్ధిదారును ఎంపిక చేయని లేని పక్షంలో ధర్నాు,ఆందోళను చేపడుతామని హెచ్చారించారు.ఈ కార్యక్రమంలో చిుక సోమయ్య,జగం ఆనంద్,వెంకన్న,నెంబర్ సోమయ్య,ఈదురు బిక్షం,బాకి ఎ్లయ్య తదితయి పాల్గోన్నారు.
సీఎం,గవర్నర్ జాతరకు రాకపోవడం దారుణం రేవంత్‌రెడ్డి
వరంగల్ : సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్ మేడారం జాతరకు రాకపోవడం దారుణమని టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి అన్నారు. మేడారం సమ్మక్క` సారక్క జాతరలో ఆయన పాల్గొని అమ్మవారికి మొక్కు తీర్చుకున్నారు. గిరిజను విశ్వాసాను ఆచారాను ప్రతిబింబించేలా ప్రభుత్వం మ్యూజియం ఏర్పాటు చేయాని డిమాండ్ చేశారు. గిరిజను జాతరను జాతీయ ఉత్సవంగా భావించి చరిత్రను, విశేషాను ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
No comments:
Post a Comment