బడ్జెట్‌పైనే అందరి దృష్టి
కేంద్రంలోని మోడీ సర్కారుకు బడ్జెట్ పరీక్షా సమయం వచ్చింది. ఓపక్క స్టాక్ మార్కెట్లలో నష్టాతో ఎదురీత,నిరాశాజనకంగా కార్పొరేట్ల ఆర్ధిక ఫలితాు, అంతర్జాతీయ విపణిలో ముడిచమురు ధరు, డార్ రూపాయి మారకం మిమ ఇవన్నీ కూడా భారత్ ఆర్ధికవృద్ధికి సవాల్‌గా నిుస్తున్నాయి. పొరుగుననే ఉన్న చైనా సంక్షోభం భారత్‌పై ఎక్కువ ప్రభావం చూపిస్తున్నది. బయటినుంచి ఎన్ని సవాళ్లు, సమస్యు ఎదురైనా భారత్ ఆర్ధికవృద్ధి 7.5 శాతంగా ఉంటుందని మరోపక్క అంతర్జాతీయ రేటింగ్ సంస్థు అంచనాపై అంచనాు కుమ్మరిస్తున్నాయి. ఈనేపథ్యం లో ఆర్ధికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్ సామాన్య మధ్యతరగతి వర్గాకు సైతం మెగురేఖు ప్రసరించేదిగా ఉండాలి. విదేశీ ఇన్వెస్టర్లనుంచి దేశంలోని చిరువ్యాపారి వరకూ అంతా ఆశగా జైట్లీవైపే చూస్తున్నారు. గతంతోపోలిస్తే పరిణామాు మారాయి.ప్రపంచ సంఘటను భౌగోళిక స్థితిగతు కూడా పరిగణనలో నికి తీసుకోవాల్సి ఉంటుంది అన్నింటికంటే వ్యక్తిగత ఆదాయపన్ను పరిమితిని 3క్షకు పైబడి పెంచాన్న డిమాండ్‌ప్రధానంగా వినవస్తోంది.ఇక కార్పొరేట్లకు ఐదేళ్ల పాటు పన్నురాయితీ, విదేశీ ఇన్వెస్టర్లు, ఫండ్ సంస్థు, పోర్టుఫోలియో ఇన్వెస్టర్లపై విధించే కనీస ప్రత్యామ్నాయ పన్నును పూర్తిగా ఎత్తివేయడంవంటి ప్రోత్సాహకా కోసం ఎదురుచూస్తున్నారు.ఇక ఆదాయపు పన్ను సెక్షన్ 80మినహాయింపు, ఉద్యోగకేటగిరికి మినహాయింపు పరిమితి పెంపు వంటివాటిపై ఎక్కువ దృష్టిపెట్టాలి. అందరినీ సంతృప్తి పరిచేవిధంగా బడ్జెట్ ఉండాంటే ప్రస్తుత పరిస్థితుల్లో కష్టమేనన్న వాదన కూడా ప్రభుత్వం వైపునుంచి వస్తోంది. 14నెలుగా వాణిజ్య ఎగుమతు క్షీణిస్తూనే ఉన్నాయి. ఏడాదిక్రితం స్టాక్ మార్కెట్లు ప్రత్యేకించి బిఎస్‌ఇ సెన్సెక్స్ 30వే పాయింట్లు కూడా అధిగమించింది. ఈ ఏడాది ఆ పరిస్థితి లేదు. దేశంలోని బ్యాంకు సమ స్యు వర్ణనాతీతంగా ఉన్నాయి. నిరర్ధక ఆస్తు(మొండి బకాయిు) పేరుకునిపోయి బ్యాంకు అప్పు ఇవ్వలేని స్థితికి చేరాయి. 2017 కల్లా ఆస్తి అప్పు పట్టీు సంతునం చేసుకోనిదే బ్యాంకుకు కష్టకాం మొద వుతుందని ఆర్‌బిఐ ఇప్పటికే చురకు వేసింది. మూ ధన వనరు క్పన లేనిదే బ్యాంకు పనితీరు కష్టం అవుతుందన్నది ఆర్ధికరంగ నిపుణు అంచనా.సాక్షాత్తూ సుప్రీం కోర్టు సైతం బ్యాంకుల్లో పేరుకునిపోయిన నిరర్ధక ఆస్తు జాబితాు ఇవ్వాని కోరిందంటే బ్యాంకు ఆర్ధిక పరిస్థితి అవగతం అవుతుంది. మరో పక్క ఆర్ధిక వృద్ధి దశదిశలా పెరగాంటే మౌలికవనరురంగం శర వేగంతో ముందుకు కదలాలి.క్షకోట్లడార్ల పెట్టుబడు అవసరం అనిభావిస్తున్న తరుణంలో విద్యుత్, రోడ్లు, రవాణా, తాగునీరు సౌకర్యాు పారిశుధ్యం వంటివి మెరుగుపరిచేందుకు ప్రైవేటురంగాన్ని ప్రోత్సహించాలి. అందుకు ఆ రంగానికి రాయితీు, ప్రోత్సాహకాు లేనిదేముందుకురారన్నది నిజమే.ఆర్ధికవ్యవస్థకు మద్దతు రావాంటే ముందు బ్యాంకింగ్, మౌలికవనరు రంగాల్లోవృద్ధి కీకం. ఇక ఆటోమొబైల్‌రంగం, టెలికాం, ఉక్కువంటి రంగాు కూడా తమకు ఊరట భిస్తుందని ఆశతో ఎదురుచూస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే పన్ను పరిమితు పెంపుపైనే ఎక్కువ ఆశు పెంచుకున్నారు.ఇక ఆర్ధికలోటు బడ్జెట్ లో3.9శాతానికి మించకుండా చూసుకుంటూనే బడ్జెట్ ను ప్రతిపాదించుకోవాల్సి ఉంది. ద్రవ్య్బోణం ఐదుశాతా నికి పరిమితంచేయాని గతబడ్జెట్‌లో ప్రతిపాదించారు. ప్రస్తుతం 5.6శాతం ఉన్న బడ్జెట్ 2017 నాటికి ఐదు శాతానికి తెస్తామని ఆర్‌బిఐ చెపుతోంది. ఇక పెట్టుబ డు ఉపసంహరణ క్ష్యం కూడా ఆశించిన క్ష్యాకు చేరడంలేదు.విదేశీ పెట్టుబడును ఆకర్షించేదిశగా ఎక్కు వ కృషిచేస్తున్న ప్రస్తుత ఎన్‌డిఎ ప్రభుత్వం ఆదిశగా చేపట్టేచర్యు కూడా కార్పొరేట్,విదేశీఫైనాన్స్ సంస్థు, ఇన్వెస్టర్ల అంచనాకు అనుగుణంగా ఉండాలి. ఏకీకృత పన్ను విధానం, జిఎస్‌టి అము,అనువర్తనపన్ను విధా నం నిలిపివేత, పారదర్శక పన్నువిధానంపైనే ఎక్కువ ఇన్వెస్టర్లు దృష్టిసారిస్తారు. ఫండ్ పెట్టుబడు రూపంలో భారత్‌కు క్ష కోట్ల పెట్టుబడు వస్తున్న నేపథ్యంలో ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టే బడ్జెట్‌పైనే అన్ని పక్షాు దృష్టిసారించాయి.రవాణా, రక్షణరంగానికి పెట్టు బడుల్లో అత్యంత ప్రాధాన్యతనిచ్చిన మోడీ ప్రభుత్వం విదేశీ పెట్టుబడుకు ఎర్రతివాచీ పరుస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ధికవృద్ధికి ఎక్కువగా బ్యాంకింగ్, మౌలిక వనరు రంగాలేకీకం. ఒకదానికొకటి అనుసంధానింప బడిన ఈ రంగాకు ప్రాధాన్యం ఉంటే ఆర్ధికవృద్ధి మెరు గుపడుతుందన్నది సుస్పష్టం. ఉత్పత్తిరంగానికి జైట్లీ ఎంతమేర ప్రాధాన్యం పెంచుతున్నారన్నది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది. అటు పారిశ్రామిక రంగం తోపాటు, ఇటు ఇన్వెస్టర్లు, సామాన్యవేతన జీవు కొత్త బడ్జెట్ నూతనాంశాపైనే తహతహతోఉన్నారు. ఓపక్క పెట్టుబడు పెంచుకుంటూ, విదేశీ కంపెనీు, ఇన్వెస్ట ర్లను ఊరిస్తూ మేకిన్ ఇండియా వంటి కార్యాచరణ వేడుకు జరుపుకుంటున్న భారత్‌లో ఇప్పటికే 21క్ష కోట్ల మేర పెట్టుబడు అందాయంటే భారత్‌పై ప్రపంచ దేశాల్లో అంచనాు రెట్టింపు అయినట్లు స్పష్టం అవుతు న్నాయి. ఈ నేపథ్యంలో ఈనె 29వ తేదీ ప్రవేశపెట్టే బడ్జెట్‌పైనే అందరూ ఎదురుచూస్తున్నారు. ఓపక్క రాయి తీ కారణంగా రెండుక్షకోట్ల భారం పడుతున్నదని చెపుతున్న ఆర్ధికశాఖ ఏఏరంగాపై వరాు కురిపిస్తుంద న్నది వేచి చూడాల్సిందే.
అమ్మ భాష
బిడ్డకు అమ్మ ఉగ్గుపాతోనే భాషను రంగరించిపోస్తుంది. అందుకే దాన్ని మాతృభాష, అమ్మభాష అన్నారు. అందువ్లనే ఎవరి అనుభవాను వారు రాయడమే కాదు తమదైన అమ్మ భాషలో రాయడం సృజన వికాసానికి అనంతమైన బం. ఉగ్గుపాతో నేర్చిన భాషే మనిషి రక్తనాళ స్పందనలో భాగమవుతుంది. అందుకే మాతృభాషకు అంత ప్రాధాన్యత ఉంది. అయినా నేడు ఆ మాతృభాషే చాలా మందికి కాని భాషగా మారడం ఘోరం. పసిప్రాయంలోనే మాతృభాషకు దూరం కావడం తొగునాట ఓ విషాద వాస్తవం. చాలా మంది తల్లిదండ్రు అమ్మానాన్న అని పిలిపించుకోవడం అవమానంగా భావించడం మన దౌర్భాగ్యం. తమ నేపై, తమ భాషపై గౌరవం లేని పాకు విధివిధానా ఫలితంగా ఏటా క్షలాది మంది ప్లిు మాతృభాషకు దూరమై తమది కాని ఆంగ్ల భాషలో చదువుకోవసిన అనివార్య పరిస్థితు నేడు దాపురించాయి. ఇది ఏ దేశంలోనూ, మన దేశంలోనే చాలా రాష్ట్రాలో లేని వింత పరిస్థితి. తొగుజాతి ఆత్మగౌరవం పేరిట ఆవిర్భవించిన పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ తొగు భాష అభివృద్ధికి ఎలాంటి చర్యూ తీసుకోకపోవడం ఆక్షేపణీయం. తమ పానావసరా కోసం ఆంగ్లేయు మనపై రుద్దిన ఆంగ్ల భాషే సర్వస్వంగా భావించడం మన తొగుజాతి దౌర్భాగ్యం. మాతృభాషలో విద్యార్జన చేసినవారూ అనేక రంగాల్లో మేటిగా తయారవుతున్నారనేది అక్షరసత్యం. అంటే ఆంగ్లంలో విద్యనభ్యసించేవారికి వీరు ఏవిూ తీసిపోరు. ప్రాథమిక విద్య మాతృభాషలో చేస్తేనే ఉపయోగమని ఆక్స్‌ఫర్డ్ అధ్యయనంలో కూడా వ్లెడయింది. కానీ ఆంగ్లం రాకపోతే అమెరికాకు వెళ్లలేరేమోనని తల్లిదండ్రు తమ తాహతుకు మించిన భారాన్ని మోస్తూ తమ ప్లిను ఆంగ్ల మాధ్యమ పాఠశాల్లో చేర్చడాన్ని నేడు చూస్తున్నాం. కానీ మాతృభాషను ఆసాంతం ఆకళింపు చేసుకున్నవారికి ఇతర భాషు చేర్చుకోవడం సువవుతుందని చరిత్ర చెప్పిన సత్యం. రాహుల్ సాంకృత్యాయన్ ఏ భాషనైనా నెరోజుల్లో ఆసాంతం నేర్చుకున్న దాఖలాు మన ముందున్నాయి. మన మాజీ ప్రధాని పివి నరసింహారావు వంటి బహుభాషా కోవిదుడులెందరో మనముందున్నారు.
నేడు డిగ్రీ చదివినా అటు తొగు రాక, ఇటు ఆంగ్లం రాక, ఏ భాషలోనూ స్పష్టంగా మాట్లాడలేకపోవడం విద్యా వ్యవస్థకే అవమానకరం. అనేకానేక అవమానాను దిగమింగుకునేవారికి ఇది చిన్న విషయమే కావచ్చు. తొగు భాష అంతర్థానమై పోయే పరిస్థితు ఎంతో దూరంలో లేకపోవడం అంగీకరించక తప్పని పరిస్థితి నేడు మనకు దాపురించింది. అంతరించిపోయే భాష జాబితాలో తొగు కూడా ఒకటని ఐక్యరాజ్యసమితి విస్పష్టంగా చెప్పినప్పటికీ మన పాకుల్లో ఏమాత్రం కదలిక లేకపోవడం గమనార్హం. అనేక ఇళ్ళలో ఖరీదైన ఫర్నిచర్, టీమీ, కంప్యూటర్లు, అధునాత మొబైల్స్ కన్పిస్తాయి. కానీ తొగు పుస్తకం మచ్చుకైనా లేకపోవడం నేటి వాస్తవం. పుస్తకాు ముఖ్యంగా మాతృభాషా పుస్తకాు ఇళ్ళలోంచి మాయమవడం ఒళ్ళు జదరింపజేసే వాస్తవం. ఒక్క పుస్తకమైనా చదవకుండా నెలకు నెలు, ఏళ్ళకు ఏళ్ళు గడిపేసే జాతి భాషను బతికించుకోగదా? దీనికి ఎవరో కొందరు వక్తును తప్పుపట్టలేము. దానికి మూం వ్యవస్థలోనే ఉంది. మనిషిని వస్తువుగా మార్చి మార్కెట్ అవసరాకు అనుగుణంగా ఆంగ్ల భాషను రుద్దడంలోనే ఈ దుర్మార్గం ఇమిడి ఉంది. మానవ సంబంధాలే కాక భాషూ విచ్ఛిన్నమై, తమ భాషను తామే ఏవగించుకునే స్థితిలోకి మనుషు నెట్టబడటం ప్రపంచీకరణ కుటిత్వం ఫలితం. మాతృభాష ప్రాధాన్యతను గుర్తించి గౌరవించడం ద్వారానే ప్రపంచీకరణ, నయా`ఉదారవాద కుట్రను ఎదుర్కోవడం సాధ్యం. మాతృభాషను నేర్చుకున్న తరువాత ఆంగ్లమే కాదు మరెన్ని పరాయి భాషనైనా నేర్చుకోవడం ఆయా వ్యక్తు ఇష్టం. కానీ మాతృభాషలో చదివితే మనుగడే లేని పరిస్థితు ఉండటం అసంబద్ధం. మన నిత్య జీవితావసరాల్లో, దైనందిన జీవన క్రమంలో మాతృభాషకు తప్ప మరో భాషకు అంతగా స్థానం లేదు. అయినప్పటికీ మనది కాని భాషలో చదువుకోవాల్సి రావడం బాధాకరం. నేడు సంపన్న దేశా అవసరాు, ప్రాధాన్యతలే ముఖ్యమై వాటికి అనువైన భాషలో చదువు కొనసాగించాల్సి రావడం బానిసత్వానికి పరాకాష్ట. తమదైన భాషలో చదువుకున్నా తమ బతుక్కు ఢోకా ఉండదన్న భరోసా భించినప్పుడే ఈ బానిసత్వం నుంచి విముక్తి సాధ్యం. ఈ దిశగా మన విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసుకోవడం మాతృభాష పురోగతికి తప్పనిసరి అవసరం. ఆంగ్లమే కాదు మరెన్ని భాషు నేర్చుకోవాన్నా అమ్మ భాషలో ప్రావీణ్యం, సాధికారత ఉండాలి. మాతృభాషను నేర్చుకోవడం విూద మమకారం, ప్రేమానురాగాున్నవారు ఇతర భాషనూ నేర్చుకోగ రు.
చైనీస్, కొరియన్, జపనీస్, ఫ్రెంచి భాషకు చెందిన కోట్లాది మంది ప్రజు తమది కాని భాషలో చదవడం లేదు. వారు ఉన్నత విద్య కూడా తమ మాతృభాషలో సాగించడాన్ని మనం చూడవచ్చు. శాస్త్ర సాంకేతిక రంగా పురోగతికి అనువుగా ఆదానప్రదానాు సాధ్యమేనన్నది కాం నిరూపించింది. ఏ భాషలో ఉన్న జ్ఞానమైనా ఇతర భాషవారు అందిపుచ్చుకోవడం ఇవాళ మరింత సువు. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్‌గా పేరుగాంచిన మన తొగు భాషను బతికించుకుని పూర్వ వైభవం కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా విధానా రూపక్పనకు చొరవ చూపడం అధికారంలో ఉన్నవారి బాధ్యత. దీని గుర్తుచేసే విధంగా సంఘటిత చైతన్యంతో వ్యవహరించడం తక్షణ కర్తవ్యం.
ఎవరు దేశద్రోహు?
రాజ్యం వర్గపానకు ఒక సాధనం. దేశం విభిన్న సమూహా, స్వరా, సమ్మేళనా సమూహం. అయితే, విద్వేషమే సాధనంగా రాజ్యం ఏలానుకున్నవారు ఏలికలైన చోట రాజ్యానికి ` దేశానికీ మధ్య ఉన్న విభజన రేఖ చెరిగిపోతుంది. రాజ్య ఆకాంక్ష, అభిప్రాయాలే దేశ జను కాంక్షాభిప్రాయాుగా చెలామణి అయ్యేందుకు రంగం సిద్ధం చేయబడి, ‘భిన్నాభిప్రాయం’ దేశద్రోహంగా నిజమైన దేశభక్తుపై విరుచుకుపడుతుంది. ఇప్పుడు మన దేశంలో సరిగ్గా ఇదే జరుగుతున్నది. ఇందుకు సజీవసాక్ష్యం ‘’నేను రాజ్యాంగంపై, కోర్టుపై నూరుశాతం గౌరవమున్న భారతీయుడిని’’ అని మొత్తుకుంటున్న జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్ధి సంఘం నాయకుడు కన్నయ్య కుమార్ రాజద్రోహ నేరం కింద జైులో మగ్గుతుండటం. ఈ ‘’రాజద్రోహి’’పై మాత్రమే కాకుండా పాత్రికేయు, ప్రొఫెసర్లు, విద్యార్థుపై సాక్షాత్తూ కోర్టు ప్రాంగణంలోనే భౌతికంగా దాడి చేసిన బీజేపీ శాసనసభ్యుడు ఓపి శర్మ బృందం సుప్రీంకోర్టునే సవాల్ చేస్తూ, కించపరుస్తూ స్వేచ్ఛగా కోర్టుముందే తిరుగుతుండటం. ఈ దాడిలో పాుపంచుకున్న బీజేపీకి చెందిన లాయర్లు కోర్టు లోప, బయట న్యాయవ్యవస్థనే కించపరచేలా వ్యాఖ్యుచేస్తూ ఊరేగుతుండటం చూస్తున్నాం. నిజానికి ఇప్పుడు దేశభక్తి గురించి ఊగిపోతూ ఉన్న సంఫ్? పరివార్ మూక చరిత్ర నీచాతి నీచం. దేశంలోని యావత్ ప్రజానీకం స్వాతంత్య్రం కోసం ప్రాణాకు తెగించి పోరాడుతున్న సమయంలో ఈ వీర దేశ భక్తు ‘హిందూ రాజ్యంకోసం’ జపం చేసుకుంటూ కూర్చున్నారే తప్ప ‘స్వరాజ్యం’ కోసం పెదవి విప్పలేదు సరికదా, స్వాతంత్య్రాన్ని సిద్ధింప చేసిన ‘జాతిపిత’ను పట్టపగు కాల్చిచంపిన నేరస్తుడిని దేశభక్తునిగా ఇప్పటికీ కొనియాడుతున్న ‘జాతిప్రేమ’ వీరిది. అంతేకాదు, నాటినుండి నేటివరకూ దేశ సార్వభౌమాధికార చిహ్నమైన జాతీయజెండాను అంగీకరించని అపర దేశభక్తి వీరిది. జమ్మూకాశ్మీర్‌ను భారతదేశంలో విలీనం చేయాల్సిన అవసరం లేదని, ప్రత్యేక దేశంగా కొనసాగించానీ రచ్చకెక్కిన రొచ్చు మనస్సు వీరిది. ‘’ఆత్మహత్యు రైతుకు ఒక ఫ్యాషనై పోయాయి’’ అని పాక బీజేపీకి చెందిన ఎంపీ గోపాల్‌శెట్టి నిర్భయంగా వ్యాఖ్యానించగా, ‘’నపుంసకత్వంతో రైతు ఆత్మహత్యు చేసుకుంటున్నారని’’ కేంద్ర వ్యవసాయశాఖా మంత్రి రాధామోహన్‌సింగ్ పార్లమెంటుకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చాడంటే ఈ సంఘపరివారపు మానవతా రాహిత్యాన్నీ మనం అర్ధం చేసుకోవచ్చు. మానవతా రాహిత్యం మూర్తీభవించిన గణమే సంఫ్?పరివారం. ఈ పరివారం అబద్ధాన్ని, అధర్మాన్ని, అజ్ఞానాన్ని, అన్యాయాన్ని, ఆయుధాన్ని మాత్రమే నమ్ముకుంటారు. శ్రమజీవును, సెక్యురిస్టును, అన్యమతస్తును, అణగారిన కుస్తునూ తమ ఎరకు దొరికించుకోవాని, లేదంటే తమ వేటుకు బలితీసుకోవానీ ఉబలాటపడతారు. ఈ ఉబలాటపు వ్యక్తీకరణలే చెన్నై ఐఐటీలో ‘అంబేద్కర్` పెరియార్ స్టడీ సర్కిల్’ నిషేధం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చోటుచేసుకున్న రోహిత్ వేము ఆత్మహత్యలాంటి భావప్రకటనా స్వేచ్ఛా వ్యతిరేక, అమానవీయ సంఘటను. ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాన్నీ ఉరిశిక్షను రద్దు చేస్తుంటే, ఇక్కడ ఉరి శిక్షను రద్దు చేయాని కోరిన వారిపై దేశ ద్రోహుంటూ ముద్ర వేయటాూ ఎంతవరకు సమంజసమో వారికే తెలియాలి. ఇప్పుడీ ఉబలాటానికి అధికారం కూడా తోడవ్వటంతో పరివార్ మూక నడక ఫాసిజం దిక్కుగా వెంపల్లాడుతోంది. ‘’మరోసారి దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించే దిశగా పానా వ్యవహారాు సాగుతున్నాయి’’ అని నాటి ‘కమండ’ రూపకర్తే నోరుజారారంటే రాబోయే రోజు ఎంత దుర్భరంగా ఉండబోతున్నాయో అర్థం చేసుకోవచ్చు. మతానికీ, జాతికీ, దేశానికీ, రాజ్యానికీ ఉన్న అర్థాను మార్చి, వీటిమధ్య ఉన్న విభజన రేఖను చెరిపేయడం ద్వారా నేటి రాజ్యరూప సంఫ్?పరివారం తాను అజేయం కావాని కుట్రు పన్నుతున్నది. కత్తు దూస్తున్నది. ఇప్పుడు సంఫ్?పరివారం ఒక మారణాయుధమైతే, రాజ్యం దాని రక్షణకవచం. ఈ రెంటి సంరక్షణలోని ప్రజాస్వామం ప్రశ్నకు ` విమర్శకూ ఆస్కారమే లేని చీకటి రాజ్యం. ఈ చీకటి రాజ్యాన్ని అంతం చేయడం ఐక్యత అనే మెతురు కాగడాతోనే సాధ్యం. అవును! ఆత్మగౌరవం` మానత్వం ఉన్న ప్రతిఒక్కరూ ఐక్యత అనే మెతురు కాగడా చేబూని చేయీచేయీ కపాలి. సంఫ్?పరివార్ మూక శక్తిఅంతా వారి వ్యతిరేక శక్తు అనైక్యతలోనే దాగి ఉంది. ఈ అనైక్యతనే యుక్తిగా వాడుకుంటూ ఒక్కొక్కరి విూద గురిపెట్టి అడ్డు తొగించుకోవానీ వ్యూహం పన్నాయి. కాబట్టి మొదట అణగారిన కుస్తును, ఆ తరువాత అన్యమతస్తును, ఆ తరువాత కమ్యూనిస్టును టార్గెట్ చేస్తూ వచ్చిన సంఫ్?పరివార్ మూకు ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానాన్నే సవాల్ చేస్తున్నాయి. ఇక వీటిని ఉపేక్షించడం క్షంతవ్యం కాదని అన్ని పక్షాూ గ్రహించాలి. ‘’భుక్తికి లేనోడు, వాడికోసం పోరాడేటోడే ` నిజమైన దేశ భక్తుడు’ అని ప్రపంచానికి చాటిచెప్పి, భక్తి నటించేటోడి బద్మాష్‌గిరిని భూస్థాపితం చేయాలి.
-----------------------------------------------------------------
అవినీతి కాలనాగులు బుసలు గొడుతున్నాయి
అమరావతి పునాధిరాళ్లలో అవినీతి కాలనాగులు బుసలు గొడుతున్నాయి. హాలివుడ్ స్థాయి గ్రాఫిక్స్‌తో రూపొందించిన రాజధాని మాస్టర్ ప్లాన్ల మెరుపుల మాటున అధికార పార్టీ చీకటి బాగోతాలు నివ్వెరపరుస్తున్నాయి. ప్రభుత్వ అండతో భూబకాసురుల అక్రమాలు, అన్యాక్రాంతాలు యధేశ్ఛగా సాగిపోతున్నాయి. అసైన్డ్ భూముల కుంభకోణం పసుపు చొక్కాల భూదాహార్తికి పరాకాష్ట. నిరుపేద దళితులకు చెందిన అసైన్డ్ భూములను సినీ పక్కీలో కాజేయడం దారుణం. బడుగు జీవులకు దక్కాల్సిన కోట్లాది రూపాయల పరిహారాన్ని పసుపుదండు పక్కా ప్రణాళికతో నిసిగ్గుగా దండుకుంది. భూసవిూకరణ సమయంలో అసైన్డ్‌భూములు, లంక భూముల గురించి ఊసెత్తని సర్కారు ఒక రకమైన మైండ్‌గేమ్‌తో ముందుకెళ్లింది. అధికార పార్టీ నాయకులు రాజధాని గ్రామాల్లో చక్కర్లు కొట్టి అసైన్డ్ భూములను టార్గెట్ చేశారు. ప్రభుత్వ భూములు కాబట్టి అసైన్డ్ భూములను రాజధానికి తీసుకున్నా చిల్లిగవ్వ కూడా పరిహారం దక్కదని ప్రచారం చేశారు. బినావిూల ద్వారా అసైన్డ్ భూములు కాజేసే పనిని సునాయసంగా కానించేశారు. కోట్లాది రూపాయల పరిహారం దక్కాల్సిన పేదల భూములను కారుచౌకగా కొల్లగొట్టారు. వాస్తవానికి భూబదలాయింపు నిషేదపు చట్టం (పిఓటి) ప్రకారం..1954 జూన్18 తర్వాత మంజూరైన అసైన్డ్ భూములు క్రయవిక్రయాలు చెల్లవు. ఒకవేళ ఎవరైనా కొనుగోలు చేసినా వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రజోపయోగ కార్యక్రమాలకు వినియోగించాలి. రాజధాని అసైన్డ్ భూముల విషయంలో భూబదలాయింపు చట్టానికి సైతం టిడిపి సర్కార్ తూట్లు పొడుస్తోంది. అసైన్డ్ భూముల విక్రయాలకు వీలుకల్పిస్తూ సవరణలు తీసుకురావాలని యత్నించడం టిడిపి బరితెగింపునకు నిదర్శనం. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని గమనించడంతో ఆ యత్నాలను విరమించుకొని దొడ్డిదారిన కుట్రలు పూనినట్లు స్పష్టమౌతోంది. భూసవిూకరణ సమయంలోనే ప్యాకేజీ ప్రకటించివుంటే భూములు అమ్ముకునేవాళ్లం కాదని, నమ్మిన పాపానికి ఇంత అన్యాయం చేస్తారా అని నిలదీసి అడుగుతున్న రాజధాని బడుగు జీవుల ప్రశ్నలకు ప్రభుత్వమే బదులివ్వాలి.
వాస్తవానికి రాజధాని విషయంలో ప్రభుత్వ వ్యవహారశైలి మొదటి నుంచీ అనుమానాలకు, విమర్శలకు తావిస్తూనేవుంది. మూడు పంటలు పండే భూములను రైతుల నుంచీ లాక్కోవడం, పరిహారం కింద ఇస్తామని ప్రకటించిన నివాసస్థలాలు, వాణిజ్య స్థలాలు ఎక్కడిస్తారో స్పష్టంగా చెప్పకుండా రైతన్నల జీవితాలతో ఆడుకోవడం అన్నీ ఆందోళన కలిగించే అంశాలే. దేశంలోనే అత్యంత మెరుగైన ప్యాకేజీగా ప్రకటించుకున్న భూసవిూకరణ సమయంలో అసైన్డ్, లంక భూముల పరిహారం ఊసేత్తకపోవడం ఒక ఎత్తు. భూసవిూకరణ, సేకరణ కూడా అయిపోయిన తర్వాత పేదల భూములన్నీ పసుపు బినావిూల చేతిలోకి వచ్చేసిన తర్వాత పట్టా భూములతో సమానంగా పరిహారం ఇస్తామని ప్రకటిస్తూ జీవో నెం 41 జారీ చేయడం మరో ఎత్తు. ఈ జిత్తులమారీ ఎత్తుల వెనుక, వ్యూహాల వెనుక పెద్ద కుట్ర దాగివుందని తేటతెల్లమౌతోంది. బినావిూ కాలనాగులు వెనుక బడా బకాసురులు దాగున్నారని స్పష్టమౌతోంది. ఒక్క రాజధాని విషయంలోనే కాదు మొన్న అనంతపురంలోని నంబులపూటకుంటలో సోలార్ పార్కుకు సంబంధించిన భూసేకరణ విషయంలోనూ టిడిపి నేతలపై ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. అసలు భూయజమానులైన నిరుపేద లబ్ధిదారులను కాదనీ, మధ్యవర్తులుగా వ్యవహరించిన పసుపుచొక్కాల పెద్దలే పరిహారపు చెక్కులు తన్నుకుపోయారని విమర్శలొచ్చాయి. ఇదేమని ప్రశ్నించిన ప్రజాసంఘాలు, వామపక్షాల నాయకులపై నిర్బంధకాండ సాగించారు. భోగాపురం ఎయిర్‌పోర్టు, నర్సాపురం ఆక్వా ఫుడ్‌పార్కు ఇలా ప్రతి చోటా పేదల భూములను ప్రభుత్వ అండతో, మైండ్‌గేమ్‌లతో అధికారపార్టీ నేతలు, బడా కార్పొరేట్లు గద్దల్లా తన్నుకెళ్తున్నారు. నిరుపేదలను భూముల నుంచి తరిమివేసే వినాశకర విధానాలను ఇకనైనా విడనాడకపోతే అధికారం నుంచి తరిమివేసేందుకు ప్రజానీకం వెనుకాడబో దన్న సత్యాన్ని పాలకులు గ్రహించాలి.తక్షణమే భూసవిూకరణ నుంచి జీవో 41 వరకు జరిగిన పరిణామాలపై సమగ్రమైన దర్యాప్తు జరిపించి నిజానిజాలు నిగ్గుతేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వ పెద్దలపై ఉంది. అసైన్డ్ భూములకు ఇచ్చే పరిహారం అసలు యజమానులకే అంటే నిరుపేద దళితులకే దక్కేలా చర్యలు తీసుకోవాలి. నయవంచనకు పాల్పడినవారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి బోనెక్కించాలి. రాజధాని భూసవిూకరణ, సేకరణలపై శ్వేతపత్రం విడుదల చేసి ప్రజల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధత్య ప్రభుత్వానిదే.
--------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఖగోళశాస్త్రంలో మరో అద్భుతం!
ఖగోళశాస్త్రంలో మరో కొత్త వైజ్ఞానిక అంశాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు.గురుత్వాకర్షక తరంగాల ఆవిష్కరణతో విశ్వపరిశీలన అంశంలో సరికొత్త బాటలుపరిచారు.ఈ ఆవిష్కరణ వైజ్ఞానికంగా ఒక మైలురాయి అని విశ్వపరిశీలనపై సంపూర్ణ సరికొత్త మార్గానికి ద్వారాలుతెరిచినట్లయింది.తొలినాళ్లలో విశ్వానికి సంబంధించిన గుట్టు వీడిపోయిందని, కృష్ణబిలాలు న్యూట్రాన్ నక్షత్రాలపై రహస్యాలు బయటికొచ్చే అవకా శం ఉందన్న భావన శాస్త్రవేత్తల్లో వ్యక్తమైంది. గురుత్వా కర్షణ తరంగాలపై తొలిసారి ప్రత్యక్ష ఆధారాలను శోధిం చినట్లు ఖగోళ శాస్త్రజ్ఞులు ప్రకటించారు. వందేళ్లక్రితమే ఐన్‌స్టీన్ తన సాపేక్షసిద్ధాంతంలో ఈ అంశాన్ని విశ్లేషించారు. గురుత్వాకర్షణ తరంగాలకు సంబంధించిన సూక్ష్మ ప్రకంపనలనుసైతం పసిగట్టేందుకు అమెరికాఖగోళ శాస్త్ర జ్ఞులు విశేషకృషికి అద్భుతఫలితాలు వచ్చాయి. భూగర్భంలో అమర్చిన లేజర్ ఇంటర్‌ఫెరోవిూటర్ గ్రావి టేషన ల్ వేవ్ అబ్జర్వేటరీ (లిగో)గా వ్యవహరించే రెండు డిటెక్ట ర్లుఈఅంశాన్ని గుర్తించినట్లు పరిశోధకులు వెల్లడించారు. 130 కోట్ల సంవత్సరాల క్రితం రెండు కృష్ణబిలాలు ఢీకొనడంతో కలిసిన రెండుభారీ ద్రవ్యరాశులు ముందు కుచలించి అంతరిక్షం గుండా 2015 సెప్టెంబరు 14న భూమికి చేరాయన్నది పరిశోధనల్లో తేలింది. అత్యాధుని క లిగోపరికరాలతో ఈ రాకను సైతం గుర్తించామని ప్రకటించారు. గత ఏడాది గుర్తించిన ఈ సమాచారం పరిశీల నకే నెలలకొద్దీ సమయం పట్టింది. ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తల బృందాలశ్రమఫలితంగా గడచిన గురువారం ఈకొత్త అంశం బాహ్యప్రపంచానికి తెలిసింది. 1916లో ఐన్‌స్టీన్ పేర్కొన్న తరహాలోనే 2015లో తాము గమనిం చిన తరంగాలు ఉన్నట్లు మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిపుణులు లిగోబృందం వెల్లడించింది. పిచ్చుకశబ్దాన్నిపోలి ఉందని,20లేదా 30 హెడ్జ్‌లతక్కువ ఫ్రీక్వెన్సీతో ప్రారంభమై లిప్తకాలంలోనే 150హెడ్జ్‌ల వరకూ వెళ్లిందన్నది శాస్త్రవేత్తల పరిశోధనల సారాంశం. అసలు ఈ గురుత్వాకర్ణ తరంగాలేమిటి అన్న అంశం లోనికి వెళితే వీటిని మొట్టమొదటిసారిగా అల్బర్ట్ ఐన్ స్టీన్ 1916లో తన సాపేక్షసిద్ధాంతంలో సూత్రీకరించడం జరిగింది. కృష్ణబిలాలు,న్యూట్రాన్ నక్షత్రాలు వంటి భారీ వస్తువులు ఢీకొనడం ద్వారా అంతరిక్షంలో కాలానికి సం బంధించిన గురుత్వాకర్షణ తరంగాలు చోటుచేసుకుంటా యని అప్పట్లో వెల్లడించారు.తదనంతరం ఆయన తరం గాలు ఉంటాయా అని కూడా సందేహాలు వ్యక్తంచేశారు. విశ్వవ్యాప్తంగా తదనంతర పరిశోధనల్లో1960లో గురు త్వాకర్షణ తరంగాలు ఉండే అవకాశంఉందని శాస్త్రవేత్త లు వెల్లడించారు. 1970లోనే వీటికి సంబంధించిన పరోక్షాధారాలు కూడా పరిశోధనల్లో గుర్తించడం జరిగిం ది. ఈ కృషికే 1993లో నోబెల్ పురస్కారం కూడా అందుకున్నారు. 1979లో అమెరికా జాతీయ వైజ్ఞానిక ఫౌండేషన్, కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్, మసాచుసెట్స్ సంస్థలకు ఈ పరిశోధనలపై నిధులు అందించాలని నిర్ణ యించారు.కొంతకాలానికి అమెరికాలోనే వాషింగ్టన్, లూసియానాల్లో రెండు లిగోడిటెక్టర్ల నిర్మాణం జరిగింది. 2001నుంచి పనిచేస్తున్నా చాలా ఏళ్లపాటు ఫలితం కని పించలేదు. దీనితో మరింత ఆధునిక గుర్తింపు వ్యవస్థను ఏర్పాటుచేశారు. గత ఏడాదే పనిచేసిన ఈ లిగో వ్యవస్థ ద్వారా అంతర్జాతీయంగా మన ఖగోళ శాస్త్రజ్ఞులు గురు త్వాకర్షణ తరంగాలను గుర్తించగలిగారు. అంతేకాదు విశ్వంపై అవగాహనలో ఒక సరికొత్త కోణం ఆవిష్కరిం చారు. దైవకణం స్థాయిలో భారీ ఆవిష్కరణ అని చెపు తున్నా అంతకంటే భారీస్థాయిలోనే ఉంటుందని మరి కొందరు పేర్కొనడం విశేషం. అంతేకాదు ఈప్రాజెక్టులో భారతీయ శాస్త్రవేత్తలు కూడా పాల్గొని కీలకపాత్రను పోషించడం అంతర్జాతీయంగా భారతీయ శాస్త్రవేత్తల పటిమకు నిదర్శనంగా నిలిచింది. వందేళ్లనాటి ఐన్‌స్టీన్ రాసిన పరిశోధనా పత్రం ఇంకా పదిలంగానే ఉంది. చక్కని చేతిరాతతో రాసిన ఈ సిద్ధాంతాన్ని రుజువు చేసేందుకు శాస్త్రవేత్తలకు, ఖగోళ పరిశోధక రంగానికి వందేళ్లకుపైగా పట్టింది.విశ్వవిఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఆనాడు చేసిన సిద్ధాంతానికి సంబంధించిన రాతప్రతి ప్రస్తుతం ఇజ్రాయిల్‌లోని హీబ్రూ విశ్వవిద్యాలయంలో భద్రంగా ఉంది. సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రతి పాదిస్తూ వెలువరించిన 46 పేజీల్లో ఓ ప్రతిని ఇక్కడ భద్రపరిచారు. జర్మన్‌భాషలో పొందు పరిచిన ఈ ప్రతులపై జరిగిన మరింత కొత్త పరిశో ధనలు గురుత్వాకర్షణ తరంగాలు నేటికీ ఉన్నాయన్న అంశాలను బాహ్యప్రపంచానికి తెలియజేశాయి. అంతే కాకుండా ఈ గురుత్వాకరణ తరంగాలకు సంబంధించిన సూక్ష్మప్రకంపనలను సైతం మన శాస్త్రవేత్తలు పసిగ ట్టారు. విశ్వవిజ్ఞానంలో వందేళ్ల నాటి పరిశోధనలను మన ఆధునిక శాస్త్రవేత్తలు ముందుకు నడిపించారు. ప్రపంచదేశాల ఖగోళ శాస్త్రజ్ఞుల పరిశోధనల్లో మన భార తీయ శాస్త్రజ్ఞులు కూడా పాల్గొని ఖగోళ రహస్యాలను ఛేదించగలిగారు. 130 కోట్ల సంవత్సరాల క్రితంనాటి రెండుబిలాలు ఢీకొనడం ద్వారా వచ్చిన ప్రకంపనాలను వివిధ దేశాల ఖగోళ శాస్త్రవేత్తలు సంఘటితంగా చేసిన పరిశోధనలు ఫలించం సామాన్యమైన విషయం కానే కాదు. గత ఏడాది భూమికి చేరిన ఈ ద్రవ్యరాశుల కదలికలను అత్యాధునిక లిగో పరికరాలతో గుర్తించి అమెరికా శాస్త్రవేత్తల బృందం ప్రపంచంలో అగ్రగామిగా నిలిచింది. ఈ పరిశోధనల్లో భారతీయ శాస్త్రవేత్తలు భాగ స్వాములు కావడం ఖగోళశాస్త్రంలో భారత్ తన పరిశోధ నలతో మరింత ముందుకు కదులుతున్నట్లు రుజువు అయిందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తిలేదు.
------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎవరు దేశద్రోహులు?
రాజ్యం వర్గపాలనకు ఒక సాధనం. దేశం విభిన్న సమూహాల, స్వరాల, సమ్మేళనాల సమూహం. అయితే, విద్వేషమే సాధనంగా రాజ్యం ఏలాలనుకున్నవారు ఏలికలైన చోట రాజ్యానికి - దేశానికీ మధ్య ఉన్న విభజన రేఖ చెరిగిపోతుంది. రాజ్య ఆకాంక్ష, అభిప్రాయాలే దేశ జనుల కాంక్షాభిప్రాయాలుగా చెలామణి అయ్యేందుకు రంగం సిద్ధం చేయబడి, 'భిన్నాభిప్రాయం' దేశద్రోహంగా నిజమైన దేశభక్తులపై విరుచుకుపడుతుంది. ఇప్పుడు మన దేశంలో సరిగ్గా ఇదే జరుగుతున్నది. ఇందుకు సజీవసాక్ష్యం ''నేను రాజ్యాంగంపై, కోర్టులపై నూరుశాతం గౌరవమున్న భారతీయుడిని'' అని మొత్తుకుంటున్న జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్ధి సంఘం నాయకుడు కన్నయ్య కుమార్ రాజద్రోహ నేరం కింద జైలులో మగ్గుతుండటం. ఈ ''రాజద్రోహి''పై మాత్రమే కాకుండా పాత్రికేయులు, ప్రొఫెసర్లు, విద్యార్థులపై సాక్షాత్తూ కోర్టు ప్రాంగణంలోనే భౌతికంగా దాడి చేసిన బీజేపీ శాసనసభ్యుడు ఓపి శర్మ బృందం సుప్రీంకోర్టునే సవాల్ చేస్తూ, కించపరుస్తూ స్వేచ్ఛగా కోర్టుముందే తిరుగుతుండటం. ఈ దాడిలో పాలుపంచుకున్న బీజేపీకి చెందిన లాయర్లు కోర్టు లోపల, బయట న్యాయవ్యవస్థనే కించపరచేలా వ్యాఖ్యలుచేస్తూ ఊరేగుతుండటం చూస్తున్నాం. నిజానికి ఇప్పుడు దేశభక్తి గురించి ఊగిపోతూ ఉన్న సంఫ్? పరివార్ మూకల చరిత్ర నీచాతి నీచం. దేశంలోని యావత్ ప్రజానీకం స్వాతంత్య్రం కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతున్న సమయంలో ఈ వీర దేశ భక్తులు 'హిందూ రాజ్యంకోసం' జపం చేసుకుంటూ కూర్చున్నారే తప్ప 'స్వరాజ్యం' కోసం పెదవి విప్పలేదు సరికదా, స్వాతంత్య్రాన్ని సిద్ధింప చేసిన 'జాతిపిత'ను పట్టపగలు కాల్చిచంపిన నేరస్తుడిని దేశభక్తునిగా ఇప్పటికీ కొనియాడుతున్న 'జాతిప్రేమ' వీరిది. అంతేకాదు, నాటినుండి నేటివరకూ దేశ సార్వభౌమాధికార చిహ్నమైన జాతీయజెండాను అంగీకరించని అపర దేశభక్తి వీరిది. జమ్మూకాశ్మీర్‌ను భారతదేశంలో విలీనం చేయాల్సిన అవసరం లేదని, ప్రత్యేక దేశంగా కొనసాగించాలనీ రచ్చకెక్కిన రొచ్చు మనస్సు వీరిది. ''ఆత్మహత్యలు రైతులకు ఒక ఫ్యాషనై పోయాయి'' అని పాలక బీజేపీకి చెందిన ఎంపీ గోపాల్‌శెట్టి నిర్భయంగా వ్యాఖ్యానించగా, ''నపుంసకత్వంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని'' కేంద్ర వ్యవసాయశాఖా మంత్రి రాధామోహన్‌సింగ్ పార్లమెంటుకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చాడంటే ఈ సంఘపరివారపు మానవతా రాహిత్యాన్నీ మనం అర్ధం చేసుకోవచ్చు. మానవతా రాహిత్యం మూర్తీభవించిన గణమే సంఫ్?పరివారం. ఈ పరివారం అబద్ధాన్ని, అధర్మాన్ని, అజ్ఞానాన్ని, అన్యాయాన్ని, ఆయుధాన్ని మాత్రమే నమ్ముకుంటారు. శ్రమజీవులను, సెక్యులరిస్టులను, అన్యమతస్తులను, అణగారిన కులస్తులనూ తమ ఎరకు దొరికించుకోవాలని, లేదంటే తమ వేటుకు బలితీసుకోవాలనీ ఉబలాటపడతారు. ఈ ఉబలాటపు వ్యక్తీకరణలే చెన్నై ఐఐటీలో 'అంబేద్కర్- పెరియార్ స్టడీ సర్కిల్' నిషేధం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చోటుచేసుకున్న రోహిత్ వేముల ఆత్మహత్యలాంటి భావప్రకటనా స్వేచ్ఛా వ్యతిరేక, అమానవీయ సంఘటనలు. ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలన్నీ ఉరిశిక్షను రద్దు చేస్తుంటే, ఇక్కడ ఉరి శిక్షను రద్దు చేయాలని కోరిన వారిపై దేశ ద్రోహులంటూ ముద్ర వేయటాలూ ఎంతవరకు సమంజసమో వారికే తెలియాలి.ఇప్పుడీ ఉబలాటానికి అధికారం కూడా తోడవ్వటంతో పరివార్ మూకల నడక ఫాసిజం దిక్కుగా వెంపల్లాడుతోంది. ''మరోసారి దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించే దిశగా పాలనా వ్యవహారాలు సాగుతున్నాయి'' అని నాటి 'కమండల' రూపకర్తే నోరుజారారంటే రాబోయే రోజులు ఎంత దుర్భరంగా ఉండబోతున్నాయో అర్థం చేసుకోవచ్చు. మతానికీ, జాతికీ, దేశానికీ, రాజ్యానికీ ఉన్న అర్థాలను మార్చి, వీటిమధ్య ఉన్న విభజన రేఖలను చెరిపేయడం ద్వారా నేటి రాజ్యరూప సంఫ్?పరివారం తాను అజేయం కావాలని కుట్రలు పన్నుతున్నది. కత్తులు దూస్తున్నది. ఇప్పుడు సంఫ్?పరివారం ఒక మారణాయుధమైతే, రాజ్యం దాని రక్షణకవచం. ఈ రెంటి సంరక్షణలోని ప్రజాస్వామం ప్రశ్నకు - విమర్శకూ ఆస్కారమే లేని చీకటి రాజ్యం. ఈ చీకటి రాజ్యాన్ని అంతం చేయడం ఐక్యత అనే వెలుతురు కాగడాతోనే సాధ్యం. అవును! ఆత్మగౌరవం- మానత్వం ఉన్న ప్రతిఒక్కరూ ఐక్యత అనే వెలుతురు కాగడా చేబూని చేయీచేయీ కలపాలి. సంఫ్?పరివార్ మూకల శక్తిఅంతా వారి వ్యతిరేక శక్తుల అనైక్యతలోనే దాగి ఉంది. ఈ అనైక్యతనే యుక్తిగా వాడుకుంటూ ఒక్కొక్కరి విూద గురిపెట్టి అడ్డు తొలగించుకోవాలనీ వ్యూహం పన్నాయి. కాబట్టి మొదట అణగారిన కులస్తులను, ఆ తరువాత అన్యమతస్తులను, ఆ తరువాత కమ్యూనిస్టులను టార్గెట్ చేస్తూ వచ్చిన సంఫ్?పరివార్ మూకలు ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానాన్నే సవాల్ చేస్తున్నాయి. ఇక వీటిని ఉపేక్షించడం క్షంతవ్యం కాదని అన్ని పక్షాలూ గ్రహించాలి. ''భుక్తికి లేనోడు, వాడికోసం పోరాడేటోడే - నిజమైన దేశ భక్తుడు' అని ప్రపంచానికి చాటిచెప్పి, భక్తి నటించేటోడి బద్మాష్‌గిరిని భూస్థాపితం చేయాలి.
No comments:
Post a Comment