International

అమెరికాలో కాల్పులు


అమెరికాలో కాల్పులు
- ఏడుగురి మృతి, అనుమానితుడి అరెస్ట్‌          (అమెరికా): మిచిగాన్‌ సిటీ పశ్చిమ ప్రాంతంలోని కలమాజూ కౌంటీలో వున్న ఒక అపార్ట్‌మెంట్‌ పార్కింగ్‌ లాట్‌లో ఒక దుండగుడు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో 14 ఏళ్ల బాలికతో సహా కనీసం ఏడుగురు మరణించినట్లు అధికారులు చెప్పారు. శనివారం సాయం త్రం జరిగిన ఈ కాల్పుల ఘటన సమాచారం తెలిసిన వెంటనే దుండగుడి కోసం వేట ప్రారంబించిన పోలీసులు 45 ఏళ్ల అనుమానితుడిని అరెస్ట్‌ చేసినట్లు ఆదివారం ప్రకటించారు. ఈ అపార్ట్‌మెంట్‌ భవన సముదాయంలో వున్న రెస్టారెంట్‌ బయట 14 ఏళ్ల బాలికతో పాటు ఐదుగురు మరణించగా, అదే భవన సముదాయంలో వున్న కార్‌డీలర్‌షిప్‌ వద్ద మరో ఇద్దరు వ్యక్తులు మరణించారని అధికారులు చెప్పారు. ఈ కాల్పుల ఘటనలో తీవ్రంగా గాయపడిన మరో మహిళ పరిస్తితి విషమంగా వుందని కలమాజూ కౌంటీ పోలీసు అధికారి పాల్‌ మత్యాస్‌ చెప్పారు. ఈ కాల్పుల గటనలో మొత్తం 9 మంది గాయపడ్డారని ఆయన వివరించారు. ఈ కాల్పులు నిర్దేశిత వ్యక్తులనుద్దేశించి జరిపినవి కావని అధికారులు భావిస్తున్నారని, ఇవి ఉన్మాదంతో చేసిన హత్యలని ఆయన చెప్పారు. కలమాజూ డెట్రాయిట్‌ నుండి 258 కి.మీ దూరంలో వుంది.

No comments:

Post a Comment