Medak

జిల్లాలో కరువు  తాండవo 
మెదక్: ఎన్నడూ లేనివిధంగా జిల్లాలో కరువు నెలకొంది. ఉపాధి లేక ప్రజలు వలసపోతు న్నారు. తండాలు సగం ఖాళీ అయ్యాయి. తీ వ్ర వర్షాభావం, భూగర్భ జలాలు పాతాళానికి ప డిపోవడంతో బోర్లు కూడా పోయడం లేదు. తా గు, సాగునీటికి కష్టాలొచ్చాయి. మనుషులు, పశువుల కు తాగేందుకు నీరు దొరకడం గగనమైంది. పశుపోషకులు వాటిని వధశాలలకు అమ్ముతున్నారు. వలసలతో తండాల్లో పిల్లలు, వృద్ధులే కనిపిస్తున్నారు. 
మైనస్‌ 45 ఎంఎం వర్షాపాతం
జిల్లాలో 2014-15లో సాధారణ వర్షాపాతం 840.7 మిల్లీ మీటర్లు. నమోదైంది మాత్రం 616.8మిల్లీమీటర్లు. అంటే -29.0ఎంఎం. అలాగే 2015 జూన్‌ నుంచి ఇప్పటి వరకు 818.3మిల్లీ మీటర్ల వర్షాపాతం నమోదు కావా ల్సి ఉండగా 446.1మిల్లీ మీటర్లు నమోదైంది. వర్షపాత లోటు -45 మిల్లీ మీటర్ల ఉంది.
పాతాళంలోకి భూగర్భ జలమట్టం
కరువు పరిస్థితి ఏర్పడడంతో ఏటేటా భూగర్భ జలాలు మీటర్లకొద్దీ కిందికి పడిపోతున్నాయి. 2015 జనవరి నాటిని జిల్లా సరాసరి నీటిమ ట్టం 18.23మీటర్లకు పడిపోయింది. 2016 జ నవరి నాటికి అది 23.82 మీటర్లు ఉంది. గతే డాదితో పోలిస్తే నీటిమట్టం -5.59మీటర్లకు ప డిపోయింది. వ్యవసాయం, తాగునీటి వనరులు బోర్లపైనే ఆధారపడి ఉండడంతో అవన్నీ పని చేయడం లేదు. సాగునీరు అటుంచి తాగునీటికి సైతం ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
తాగు నీటికి కష్టాలే
నారాయణఖేడ్‌ నియోజవకర్గంలోని నారాయ ణఖేడ్‌, కంగ్టి, మనూర్‌, కల్హేర్‌ మండలాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. బోర్లు, బావులు ఎండి పోయాయి. నీటికోసం ప్రజలు రోజూ రోడ్డెక్కు తున్నారు. అక్కడక్కడ పోస్తున్న వ్యవసాయ బో ర్ల వద్దకు వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు. సిం గూరు ప్రాజెక్టులో నీరు లేదు. సంగారెడ్డి, పటా న్‌చెరు, జహీరాబాద్‌, సదాశివపేట, నర్సాపూర్‌, మెదక్‌, పటాన్‌చెరు ప్రాంతాలకు మంజీర నీటి సరఫరా నిలిచిపోయింది. సత్యసాయి వాటర్‌ వ ర్క్స్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ కింద చేపట్టిన పథకాలూ పూర్తిస్థాయిలో పని చేయడంలేదు. పారిశ్రామిక ప్రాంతాలైన పటాన్‌చెరు, ఐడీఏ బొల్లారం, గడ్డ పోతారం, జిన్నారం ప్రాంతాల్లోనైతే నీటి కష్టాలు రెట్టింపయ్యాయి. తాగునీరే కాకుండా వాడుకునే నీటిని సైతం కొనుక్కొంటున్నారు. ప్రత్యామ్నా య చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫల మవుతున్నారని ప్రజలు అంటున్నారు. ఏప్రిల్‌, మే నెలల్లో మరింత క్లిష్ట పరిస్థితులు ఉంటాయ ని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
17,898హెక్టార్లు తగ్గిన సాగు
జిల్లా వ్యాప్తంగా సాగు విస్తీర్ణం భారీగా తగ్గిం ది. కరువు సాగుపై ప్రభావం చూపింది. 2015 ఖరీఫ్‌లో సాధారణ విస్తీర్ణం 4,32,939 హెక్టా ర్లకు 4,15,041హెక్టార్లు సాగైంది. 17,898 హెక్టార్ల సాగు తగ్గింది. గతేడాది నీటి సదుపా యం కింద వేసిన పంటలు 61,512 హెక్టా ర్లు.. సాధారణ విస్తీర్ణం 86,286. సాధారణం లో ఇది 71 శాతంగా ఉంది.
కబేళాలకు తరులుతున్న పశువులు
గత పశుగణన లెక్కల ప్రకారం జిల్లాలో 4,42,272 ఆవులు, ఎడ్లు, 4,37,007 బర్లు, దూడలు, 10,83,770 గొర్రెలున్నాయి. వీటికి 7,92,706 టన్నుల పశుగ్రాసం అవసరం. ప్ర స్తుతం 7,79,499 టన్నులు అందుబాటులో ఉ ంది. 13.207టన్నులు అవసరం. కరువుతో ప శువులకు మేత, తాగునీరు దొరక్క పశుపోషకు లు వాటిని కబేళాలకు అమ్మేస్తున్నారు. గత ఏప్రి ల్‌ నుంచి 2016 ఫిబ్రవరి వరకు జిల్లాలో 26,503 పశువులు, జీవాలు కోతకు తరలాయి.
తండాలు ఖాళీ...
నారాయణఖేడ్‌ నియోజవకర్గ కేంద్రంతో పా టు రూరల్‌ మండలం, కంగ్టి, మనూర్‌, కల్హేర్‌, పెద్దశంకరంపేట్‌ మండలాలు కలిసి 124 పం చాయతీలు, 162 ఆవాసాలు, 174 తండాలు న్నాయి. మనూర్‌ మండలంలో మంజీర నది, క ల్హేర్‌ మండలంలో నల్లావాగు ప్రాజెక్టు ఉంది. వాటిల్లో నీరు లేదు. ఈ ప్రాంతమంతా ఎడారి గా మారింది. గత ఖరీఫ్‌లో వేసిన పంటలు ఎం డిపోయి పెట్టుబడులు కూడా రాలేదు. రైతులు, రైతు కూలీలు వలసపోతున్నారు. తండాల నుం చి నిజామాబాద్‌, కరీంనగర్‌, బోధన్‌, సంగారె డ్డి, జహీరాబాద్‌, హైదరాబాద్‌లకు వలసవెళ్లా రు. కంగ్టి మండలం సర్దార్‌తండాలో ఉన్న 123 కుటుంబాల్లో 100 కుటుంబాల వలసపోయా యి. ఇక్కడ ఉపాధి పనులు కూడా పూర్తిస్థాయి లో చేయించడం లేదు. చేసిన పనులకూ కూలి చెల్లించడంలేదు. 'పట్నం పోకుంటే కడుపెట్ల ని ండుతది సారూ?' అంటూ సర్దార్‌తండాకు చెం దిన రమ్తాబాయి, రమ్మి, జమ్తాబాయి అన్నారు. 'మా కొడుకులు, కోడళ్లు చెరుకు తోటలు నరికేం దుకు పోయిర్రు. వారు వచ్చేందుకు ఇంకా రెం డు నెలలు పడుతుంది. ఇక్కడ తాగేనీళ్లకు ఇబ్బ ంది పడుతున్నం. మమ్మల్ని అధికారులు ఆదుకో వాలె.' అని అన్నారు. కంగ్టి మండల తండాలే కాదు.. నారాయనఖేడ్‌, నర్సాపూర్‌, జహీరాబా ద్‌, మెదక్‌, సంగారెడ్డి ప్రాంతాల్లోని తండాల వా సులూ పనుల్లేక అల్లాడుతున్నారు. పనులు లేక వలసపోతున్నారు. గ్రామాలూ మినహాయింపు కావు. ఉపాధి పథకం కింద 200రోజుల పనిది నాలు కల్పించి, రోజు కూలి రూ.300 చెల్లించా లని వారు కోరుతున్నారు. ప్రభుత్వం కరువు స హాయక చర్యలు తక్షణమే చేపట్టాలని, నీటి ఎద్ద డిని నివారించాలని, వలసలను అరికట్టాలని ప్ర జలు డిమాండ్‌ చేస్తున్నారు.

సిద్దిపేటనుసందర్శించినసిరిసిల్లా మున్సిపల్‌  అధికారులు
సిద్దిపేట ఫిబ్రవరి (వుదయం ప్రతినిధి):`  స్థానిక సిద్దిపేట మున్సిపలిటిని కమీషయర్‌ రమణాచారి గారు కె.టీ.ఆర్‌ గారి ఆదేశా మేరకు శనివారం రోజున  సిరిస్లి మున్సిపలిటి నుండి వచ్చిన మంత్రి కె.టీ.ఆర్‌ గారి ఓ.యస.్‌డీ.శ్రీనివాస్‌ గారు,చైర్‌పర్సన్‌  సామ పావని`దేవదాసు, కమీషనర్‌ సుమన్‌ రావు, 15 మంది ఆఫీస్‌ స్టాఫ్‌, 15 మంది కౌన్సిర్లు సిద్దిపేట పురపాక సంఘంలో జరుగు పు అభివృద్ది పను చేపట్టని కె.టీ.ఆర్‌. గారు. ఆదేశించినారు. సిరిస్లి నుండి వచ్చిన వారికి మొదటిగా  పురపాక సంఘం ఆఫీస్‌ను, తదుపరి మందపల్లి వర్మి కంపోస్‌యార్డు, ఐ.టీ.సీ. గోడామ్‌ , ప్రశాంత్‌నగర్‌ స్మశాన వాటికను, కోమటి  చెరువు వంటి ప్రదేశాు చూపించటం జరిగింది. సిద్దిపేట పట్టణంలో జరుగుతున్న  అభివృద్ది పనును ప్రతిధి వారికి  అద్ధ అయ్యె విధంగా  సిద్దిపేట మున్సిపల్‌ కమీషనర్‌ రమణాచారి గారు చెప్పటం జరిగింది.  ఇట్టి కార్యక్రమునకు సిద్దిపేట  ఓ.యస్‌్‌డీ.బాల్‌రాజ్‌ , చైర్మన్‌ రాజనర్సు, వైస్‌ చైర్మన్‌ బాల్‌రాజ్‌, ణజు.్‌  క్ష్మణ్‌,Aజుజు ఇంతియాజ్‌, మేనేజర్‌ నరెందర్‌ ,R.ూ  వేంకట్‌ నారాయణ, సానిటరి ఇన్స్‌పెక్టర్‌ కృష్ణారెడ్డి, హెల్త్‌అసిస్టెంట్‌ మక్బుల్‌ తదితరు పాల్గోనడం జరిగింది.  

No comments:

Post a Comment