Bussiness

       రియన్స్‌ 4జీ లైఫ్‌ స్మార్ట్‌ఫోన్లను విడుదల

న్యూఢల్లీి,బిజినెస్‌,ఫిబ్రవరి  (ఎ.ఎం.ఎస్‌) : రియన్స్‌ సంస్థ రెండు ప్రాథమిక స్థాయి 4జీ ఆధారిత లైఫ్‌ (ఎల్‌వైఎఫ్‌) స్మార్ట్‌ఫోన్లను విడుద చేసింది. లైఫ్‌ ఫ్లేమ్‌1, లైఫ్‌ విండ్‌ 6, పేరుతో వీటిని అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటి ధరను కంపెనీ వరుసగా రూ.6,490, రూ.7,090గా నిర్ణయించింది. దేశ వ్యాప్తంగా దాదాపు 1,20,000 రిటైల్‌ అవుట్‌లెట్లలో ఈ ఫోన్లు భించనున్నట్లు సంస్థ తెలిపింది. ఈ రెండు ఫోన్లు కటింగ్‌ ఎడ్‌జ టెక్నాజీతో పాటు వీఓఎల్‌టీఈ, వీఓ వైఫై వంటి అధునాతన ఫీచర్లతో భించనున్నాయి. ఈ రెండు ఫోన్లు క్వాలికామ్‌ స్నాప్‌ డ్రాగన్‌ చిప్‌సెట్‌, 1జీబీ ర్యామ్‌తో పాటు బ్లింక్‌ డిటెక్షన్‌, స్మయిల్‌ డిటెక్షన్‌తో కూడిన 5 మెగా పిక్సల్‌ ముందు, వెనుక కెమేరాు ఈ ఫోన్ల ప్రత్యేకత అని రియన్స్‌ జియో తెలిపింది. ఫ్లేమ్‌1 స్మార్ట్‌ఫోన్‌ను మెరుగైన సెల్ఫీను అందుకొనేలా కంపెనీ తీర్చిదిద్దింది. వీడియో కాలింగ్‌కు కూడా ఉపయోగపడేలా ముందు కెమేరాను మెరుగ్గా అమర్చారు. నుపు, తొపు, ముదురు నీం, ముదురు ఎరుపు రంగుల్లో ఇవి భిస్తాయి. విండ్‌ 6 స్మార్ట్‌ఫోన్‌ 5 అంగుళా తెర, 1జీబీ ర్యామ్‌, ఆకర్షణీయమైన ప్రీమియం గ్లోస్‌ ఫినిష్‌, కాంపాక్ట్‌ డిజైన్‌తో పాటు మెరుగైన కమ్యూనికేషన్‌కు తొడ్పడేలా దీనిని తయార చేశారు. ఈ ఫోన్‌ నుపు, తొపు, బంగారం రంగులో భిస్తాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

సిమెంట్‌ పరిశ్రమ రంగంలో అతిపెద్ద కొనుగోులు


 న్యూఢల్లీి,బిజినెస్‌,ఫిబ్రవరి  (ఎ.ఎం.ఎస్‌) : దేశ సిమెంట్‌ పరిశ్రమ రంగంలో అతిపెద్ద కొనుగోు వ్యవహారం నమోదు అయింది. జేపీ గ్రూపు సంస్థ తన సిమెంట్‌ వ్యాపారాన్ని ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన అల్ట్రాటెక్‌ సిమెంట్‌కు రూ.16,500 కోట్లకు విక్రయించింది. దీంతో దాదాపు సాలీనా 224.0 టన్ను సిమెంట్‌ తయారీ సామర్థ్యం కలిగిన జేపీ సిమెంట్‌ వ్యాపారం అల్ట్రాటెక్‌ సిమెంట్‌ పరం కానుంది. ఈ కొనుగోు ఒప్పందంతో అల్ట్రాటెక్‌ సిమెంట్‌ సామర్థ్యం ఏడాదికి 68.3 మెట్రిక్‌ టన్ను స్థాయి నుంచి 90.7 మెట్రిక్‌ టన్నుకు పెరగనుంది. ఈ వ్యవహారానికి ఇంకా మార్కెట్‌ నియంత్రణ సంస్థ అనుమతుతో పాటు నిర్దిష్టమైన ఒప్పందాు కూడా కుదరాల్సి ఉంది. ఈ కొనుగోు వ్యవహారంతో ఇప్పటివరకు ఉనికి లేని సట్‌నా, తూర్పు ఉత్తరప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌ తీర ప్రాంతాలో అల్ట్రాటెక్‌ తన వ్యాపారాన్ని విస్తరించేందుకు మీపడనుంది. ఈ వ్యవహారంతో ఇప్పటికే దాదాపు రూ.60,000 కోట్ల మేర కార్పొరేట్‌ రుణంతో సతమతమవుతున్న జేపీ గ్రూపు బకాయి భారం రూ.16,500 కోట్ల మేర తగ్గనుంది.



ఆసక్తిగా మారనున్న ‘ఆర్థిక సర్వే`2016’ 
Image result for economical india


 బిజినెస్‌, ఫిబ్రవరి  అంతర్జాతీయంగా నెకొన్న అనుకూ పరిణామా నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్లు గత వారం మదుపరుకు లాభాను పంచాయి. శుక్రవారంతో ముగిసిన వారంలో మార్కెట్లు మంచి పనితీరును కనబరిచాయి. దాదాపు మూడు శాతం మేర పెరిగాయి. ఒక వారంలో మార్కెట్లు దాదాపు 3% మేర పెరగడం 2016లో ఇదే ప్రప్రథమం. అంతర్జాతీయంగా మార్కెట్లు లాభా బాట పట్టడం, కనిష్ఠ స్థాయి నుంచి చమురు ధరు పెరగడంతో పాటు బ్లిచిప్‌ షేర్ల కొనుగోళ్లు పుంజుకోవడం మార్కెట్‌కు బాగా కలిసి వచ్చింది. 19వ తేదీతో ముగిసన వారానికి బీఎస్‌ఈ సెన్సెక్‌?స దాదాపు 723 పాయింట్ల (3.15 శాతం) మేర పెరిగింది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈ సూచీ నిఫ్టీ కూడా 230 పాయింట్ల (3.29%)మేర లాభపడి 7,000 పాయింట్ల మ్యాజిక్‌ ఫిగర్‌ను దాటింది. చివరాఖరున 7,211 పాయింట్ల వద్ల స్థిరపడిరది. అక్టోబరు 2015 తరువాత మార్కెట్‌ ఒక్క వారంలో ఇంత భారీ లాభాను ఆర్జించడం ఇదే తొసారి. మిడ్‌క్యాప్‌ సూచీ 1.95%, స్మాల్‌ క్యాప్‌ సూచీ 2 శాతం మేరు పెరిగాయి.
ఎఫ్‌ అండ్‌ వో నేపథ్యంలో ఒడుదొడుకులే.. 
ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ (ఎఫ్‌ అండ్‌ వో) విభాగంలో ట్రేడర్లు కొత్తగా పొజిషన్స్‌ తీసుకోనున్న నేపథ్యంలో సోమవారం (22) నుంచి ప్రారంభం కానున్న వారంలో స్టాక్‌మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకుకు గరయ్యే అవకాశం ఉంది. ఫిబ్రవరి మాసానికి చెందిన డెరివేటివ్‌ కాంట్రాక్టు గురువారంతో ముగియనున్నాయి. మదుపయి కొత్తగా మార్చి పొజిషన్స్‌ తీసుకోనున్నారు. ఈ నె 25న రైల్వే శాఖ మంత్రి సురేష్‌ప్రభూ రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో స్టీల్‌, సిమెంట్‌, బొగ్గు, ముడి ఇనుము, ఫెర్టిలైజర్స్‌ రంగాకు చెందిన స్టాక్‌పై మదుపయి ఎక్కువగా దృష్టి సారించే అవకాశం ఉంది. 26న ఆర్థిక మంత్రుత్వ శాఖ ‘ఆర్థిక సర్వే’ను పార్లమెంట్‌ ముందు ప్రవేశపెట్టనుంది. 29న పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రి జైట్లీ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో దానికి ప్రతిబింబంగా చెప్పబడే ‘ఆర్థిక సర్వే’ కూడా మదుపరును కొంత ప్రభావితం చేయనుంది. అంతర్జాతీయంగా చూస్తే ఫిబ్రవరి మాసానికి చెందిన ‘యూరోజోన్‌ మార్కిట్‌ పీఎంఐ కాంపొజిట్‌ ఇండెక్స్‌’ 22న విడుద కానుంది. 23న అమెరికాలో గృహా అమ్మకా గణాంకాు వ్లెడికానున్నా యి. 26న అమెరికా నాుగో త్రైమాసికానికి సంబంధించిన జీడీపీ గణాంకాు రానున్నాయి. ఈ డేటా కూడా వచ్చే వారం మార్కెట్లపై కొంత ప్రభావితం చేయనుంది. ప్రధానంగా చమురు ధర కదలిక మార్కెట్‌ను ముందుకు నడిపించనుందన్న కాదనలేని మరో సత్యం.





----------------------------------------------------------------------------------------------------------
19-2-2015
బడ్జెట్‌ -2016 కసరత్తు ప్రారంభమైంది



న్యూఢిల్లీ (ఎ.ఎం.ఎస్‌) బిజినెస్‌ ఫిబ్రవరి : కేంద్ర బడ్జెట్‌ -2016 కసరత్తు ప్రారంభమైంది. శుక్రవారం న్యూఢిల్లీలోని ఆర్థిక మంత్రిత్వ శాఖ భవనం నార్త్‌బ్లాక్‌లో బడ్జెట్‌ ప్రతుల ప్రింటింగ్‌ మొదలయ్యింది. ఈ ప్రక్రియను హల్వా తయారీతో ప్రారంభించడం అనవాయితీ. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, సహాయ మంత్రి జయంత్‌సిన్హా ఉద్యోగులకు, సిబ్బందికి స్వయంగా హల్వా పంపిణీ చేశారు. బడ్జెట్‌ తయారీ ప్రక్రియ ప్రారంభం నుంచి పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టే వరకు ఉద్యోగులు తమ ఇళ్లకు వెళ్లడానికి వీలు లేదు. కార్యాలయంలోనే టారు.కనీసం కుటుంబ సభ్యులతో ఫోన్‌లో కూడా మాట్లాడటానికి అనుమతివ్వరు. ఇ-మెయిల్‌ ద్వారా కూడా ఎవరినీ సంప్రదించడానికి వీల్లేదు. ఎంపిక చేసిన కొందరు అత్యున్నత అధికారులకు మాత్రమే ఇళ్లకు వెళ్లేందుకు, ఫోన్లకు అనుమతి ఇస్తారు. ఫిబ్రవరి 29న జైట్లీ పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే.

----------------------------------------------------------------------------------------------------------------------------------------

పన్ను సంస్కరణలు చేస్తాం

ముంబయి (ఎ.ఎం.ఎస్‌) బిజినెస్‌ ఫిబ్రవరి  : భారత్‌లో పెట్టుబడులకు మద్దతు ఇవ్వడానికి ఇప్పటి వరకు ఉన్న అనేక నియంత్రణలు ఎత్తివేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ పెట్టుబడిదార్లకు హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్‌లోకి విదేశీ పెట్టుబడులు భారీగా తరలివచ్చాయన్నారు. మేక్‌ ఇన్‌ ఇండియా ద్వారా భారత్‌ను గ్లోబల్‌ తయారీ హబ్‌గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. జిడిపిలో తయారీ రంగం వాటాను 25 శాతానికి చేర్చాలని నిర్ధేశించుకున్నామన్నారు. ఇందుకోసం వికేంద్రీకరణ, పన్ను సంస్కరణలు చేపడుతామని హామీ ఇచ్చారు. శనివారం ముంబయిలోని ఏర్పాటు చేసిన మేక్‌ ఇన్‌ ఇండియా వీక్‌లో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో సులభ వ్యాపారానికి ద్వారాలు తెరిచామని మోడీ చెప్పారు. ఒక్క ఏడాదిలోనే మేక్‌ ఇన్‌ ఇండియా బ్రాండ్‌కు విశేష గుర్తింపు లభించిందన్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు భారత్‌ స్వర్గదామంగా ఉందని మోడీ పునరుద్గాటించారు. ఆటోమెటిక్‌ రూట్‌లో ఎఫ్‌డిఐలకు అవకాశం కల్పించడం ద్వారా తాను అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎఫ్‌డిఐల్లో 48 శాతం పెరుగుదల చోటు చేసుకుంది. అనేక రంగాల్లో ఆటోమెటిక్‌ పద్దతిలో ఎఫ్‌డిఐలకు అనుమతిస్తున్నామన్నారు. ఇది వరకు ఎప్పుడూ లేని విధంగా 2015 డిసెంబర్‌లో రికార్డు స్థాయిలో ఎఫ్‌డిఐలు నమోదయ్యాయని చెప్పారు. ద్వంద పన్నులకు ముగింపు పలుకుతున్నామని చెప్పారు. 2015-16లో మునుపెన్నడూ లేని విధంగా బొగ్గు ఉత్పత్తి జరిగిందన్నారు. ఇదే సమయంలో రికార్డు స్థాయిలో విద్యుత్‌ ఉత్పత్తి నమోదయ్యిందన్నారు. త్వరలోనే మేదోహక్కుల చట్టం, రుణాల ఎగవేతదార్లపై చర్యలకు ప్రత్యేక చట్టాలకు ప్రాధాన్యతనిస్తున్నామని, త్వరలోనే వీటిని ఆమోదించనున్నామని చెప్పారు. పబ్లిక్‌, ప్రయివేటు భాగస్వామ్యంలో అనేక ప్రాజెక్టులను చేపడుతున్నా మన్నారు. రైలు, రోడ్డు, నీటి పారుదల రంగాలకు పెట్టుబడులను సమకూర్చడానికి నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌ (ఎన్‌ఐఐఎఫ్‌)ను అందుబాటులోకి తెచ్చామన్నారు. అనేక రకాల విత్త పథకాలను ప్రవేశపెట్టామని మోడీ చెప్పారు. ఇందులో భాగంగానే ముద్రా పథకాన్ని ప్రవేశపెట్టామని చెప్పారు. తాను మేక్‌ ఇన్‌ ఇండియా క్యాంపెయిన్‌ ప్రారంభించినప్పుడు తయారీ రంగం కేవలం 1.7 శాతం వ ద్ధితో ఉందని, ప్రస్తుత త్రైమాసికంలో ఇది 12.6 శాతం వ ద్ధిని కనబర్చే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 72 దేశాల ప్రతినిధులు, 2,500 అంతర్జాతీయ కంపెనీలు, 8,000 దేశీయ కంపెనీలు పాల్గొన్నాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. సుమారు 3000కు పైగా ద్వైపాక్షిక సమావేశాలు జరుగుతాయన్నారు. ఈ నెల 13- 18 నుంచి జరిగే ఎంఐఐ వీక్‌ కోసం ప్రభుత్వం 80 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ కార్యక్రమం ద్వారా రతన్‌ టాటా, సైరస్‌ మిస్తీ, ముకేశ్‌ అంబానీ, అజరు పిరమల్‌, కుమార్‌ మంగళం బిర్లా, ఆనంద్‌ మహీంద్రా, గౌతమ్‌ అదానీ.. తదితర బడా దిగ్గజాలతో ప్రధాని సమావేశం అవుతారని ఆ వర్గాలు తెలిపాయి.

----------------------------------------------------------------------------------------------------

మినహాయింపుల వల్ల పన్నుల చెల్లింపు ల్లో అసమానతలు  

(ఎ.ఎం.ఎస్‌) బిజినెస్‌ ఫిబ్రవరి : న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఈనెల 29 వ తేదీ బడ్జెట్‌ను సమర్పిస్తున్న ద ష్ట్యా, కార్పొరేట్‌ ఆర్థికసేవల రంగాలు, వ్యక్తిగత పన్నుచెల్లింపు దారులు, ఉత్పత్తిరంగ నిపుణులు భారీఆశలు పెంచుకుంటుంటే ప్రభుత్వం మాత్రం మినహాయి పులను తగ్గించాలని చూస్తోంది. పన్ను మినహా యింపుల కారణంగా సాలీనా రెండు లక్షల కోట్లు తగ్గుతున్నాయని, వీటన్నింటిని తొలగించి దేశీయ ఉత్పత్తిరంగ కంపెనీలకు మేకిన్‌ఇండియాలో ఊతం ఇవ్వాలని నిర?యించింది. పన్నుల హేతుబద్దీకరణ, సులభతరం చేయడమేనని చెపుతోంది. ఆర్ధికవ ద్ధి, ఉపాధికల్పనకు బడ్జెట్‌లో ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని, దేశీయ ఉత్పత్తిదారులకు మాత్రం మేకిన్‌ ఇండియా నేపథ్యంలో ప్రాధాన్యత ఉంటుందని ప్రభుత్వం హామీ ఇస్తోంది.  పన్ను మినహాయింపుల ను తొలగించి వారికి పన్నుశాతాన్ని తగ్గించాలని దీనివల్ల చెల్లింపుల్లో హేతుబద్దత ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రత్యక్ష పన్నులపరం గా లక్ష కోట్లు మినహాయింపుల్లోనే పోతున్నదని, మినహాయింపులు మంచిదే అయినా పన్నుల వ్యవస్థకు భారం అవుతోందని, అదే పరోక్ష పన్నుల్లో కూడా మరొక లక్ష కోట్ల రూపాయలు నష్టపోతున్నట్లు ఆర్థికశాఖ అంచనా వేసింది. సెజ్‌ లు, ఇఒయుల కింద ఈ మినహాయింపులిస్తోంది. వీటన్నింటినీ తొలగించి పన్నులనే తక్కువశాతంలో వారికి విధిస్తే న్యాయం జరుగుతుందన్న భావనలో ఉంది. ఇందుకోసం ముసాయిదాను కూడా సిద్ధం చేసిన ఆర్థికశాఖ ముందుపన్ను మినహాయింపులను రద్దుపైనే ద ష్టిసారించింది. అయితే పూర్తిస్థాయిలో తగ్గించలేమని, సంఖ్యాపరంగా ఎక్కువ మిన హాయింపులు తొలగించగలమన్న ధీమా వ్యక్తం చేస్తోంది. మినహాయింపుల వల్ల పన్నుల చెల్లింపు ల్లో అసమానతలు వస్తున్నాయని చిన్నకంపెనీలు, పెద్ద కంపెనీల మధ్య వత్యాసాలు ఎక్కువవుతు న్నట్లు ఆర్థికశాఖ గుర్తించింది. పన్నులు, జిడిపి నిష్పత్తిని పెంచాల్సిన అవసరంఎంతో ఉంది. పన్నుల వ్యవస్థను ముందు హేతుబద్దీకరించి మిన హాయింపులు తొలగిస్తే జిడిపి పన్నుల నిష్పత్తి క్రమే పి పెరుగుతుందని అంచనా వేస్తోంది. విదేశీ పెట్టు బడులను మరింతగా ఆకర్షిఇంచేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల బహుళ సుంకం విధింపును తగ్గించాల్సిఉంది. జిఎస్‌టి అమలుతోనేఇది సాధ్యం అవుతుందని కేంద్రంభావిస్తోంది. జిఎస్‌టి ఏకీక త పరోక్షపన్ను వ్యవస్థను ప్రవేశపెడుతున్నది. ఎక్సైజ్‌, సేవాపన్ను, అమ్మకపుపన్ను, ఆక్ట్న్రాు వంటి వాటి పై ఎక్కువ ద ష్టిపెట్టింది. ఇప్పటివరకూ చూస్తే కార్పొరేట్‌పన్నుల వసూళ్లు ఆశాజనకంగా లేదు. కార్పొరేట్లఫలితాలు కూడా ఆశాజనకంగా లేవు. దీని వల్లనే 33శాతం వ ద్ధి ఉండాల్సిన పరోక్ష పన్నులు 11శాతం మాత్రమే వ ద్ధి ఉన్నట్లు తేలింది. ప్రత్యక్ష పన్నుల ద్వారా ఇప్పటికే 40వేల కోట్లు రావాల్సి ఉంది. ఆర్థికసంవత్సరంలోపు పూర్తయితే గడచిన ఐదేళ్లలో మొట్టమొదటిసారి పన్నువసూళ్ల లక్ష్యం చేరుకున్నట్లవుతుంది. అలాగే పన్నుల పరిధిని కూడా పెంచాల్సి ఉంది. మొత్తం జనాభాలో కేవలం 3.5శాతం మంది మాత్రమే పన్నులు చెల్లిస్తున్నందున ఈ పరిధిని కూడా మరింత పెంచాల్సిన అవ సరం ఎంతో ఉంది. 120 కోట్ల జనాభా లో కేవలం నాలుగుకోట్ల మంది మాత్ర మే పన్ను రిటర్నులు దాఖలు చేస్తు న్నారు. మరో రెండుకోట్ల మంది టిడిఎస్‌ రూపంలో పన్నులు చెల్లిస్తున్నారు ప్రస్తు తం 3.4 లక్షల లిటిగేషన్‌ దరఖాస్తులు పెం డింగ్‌లో ఉన్నాయి. పరోక్షపన్నుల పరంగా కూడా 1.36 లక్షలు పెండింగ్‌లో ఉన్నట్లు తేలింది. పన్ను చట్టాలను హేతుబద్ధం చేసి సరళీక తం చేయాల్సిన అవసరం ఉంది అప్పుడే విదేశీ పెట్టు బడులు పెరుగుతాయి. కొత్త బడ్జెట్‌ ప్రవేశపెట్ట నున్న సందఠంగా వీటన్నింటినీ అమలుకు తీసుకు రాగలరా అన్నదే మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారిం దని ఆర్థికరంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

-----------------------------------------------------------------------------------------------------

ఫోర్డ్‌ ఇండియా రెండు తెలుగు రాష్ట్రాలో

హైదరాబాద్‌(ఎ.ఎం.ఎస్‌) బిజినెస్‌ ఫిబ్రవరి  : ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ ఫోర్డ్‌ ఇండియా రెండు తెలుగు రాష్ట్రాల్లో నెట్‌వర్క్‌ను విస్తరిస్తోన్నట్లు ప్రకటించింది. కంపెనీ అధీకత విడిభాగాలకు గాను హైదరాబాద్‌లోని జెపి ఆటోజోన్‌ను ప్రత్యేక పంపిణీదారుగా, తమ అసలైన సర్వీసు విడిభాగాల సరఫరాదారుగా ఎంపిక చేసుకున్నామని ఆ సంస్థ కస్టమర్‌ సర్వీస్‌ ఆపరేషన్స్‌ ఉపాధ్యక్షుడు ఎన్‌ ప్రభూ ఒక్క ప్రకటనలో తెలిపారు. నాణ్యత, భద్రత, సురక్షితమైన ఫోర్ట్‌ అసలైన నిజమైన విడిభాగాలను కస్టమర్ల కు చేరువచేసే లక్ష్యంతో డీలర్‌షిప్‌లను విస్తరిస్తున్నామన్నారు. కంపెనీ పరంగా మొత్తం 850 విడిభాగాలను సబ్‌ అసెంబ్లీ రిపేర్స్‌ విభాగం ద్వారా అందుబాటు లోకి తెచ్చామన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా రోడ్‌సైడ్‌ అసిస్టెన్స్‌, 90 మినిట్‌ క్విక్‌సర్వీస్‌ బేస్‌, మొబైల్‌ సర్వీస్‌వ్యాన్లు, వెహికల్‌ రిపోర్టుకార్డు సర్వీసులను అందిస్తున్నామని ఆయన తెలిపారు.


No comments:

Post a Comment